మకర సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఎలా వచ్చిందంటే..

మకర సంక్రాంతి పండుగ అనేక విధాలుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు.

గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం  కూడా అందుకే వచ్చింది. 

సంక్రాంతి తెల్లవారుజామున లేచి సూర్యుని ఎండలో నిలబడి గాలిపటాలను ఎగరవేస్తారు.

ఆ సమయంలో సూర్య కిరణాలు ఆరోగ్యకరమైనవిగా చెబుతారు.

ఉదయం పూట సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. చర్మానికి చాలా మంచిది.

చలిగాలుల వల్ల కలిగే అనారోగ్యాలతో పోరాడేందుకు సాయపడుతుంది.  

శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. 

ఎండలో కాసేపు సరదాగా గడపటం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇలా సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం వచ్చింది..