Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

ప్రతి ఏడాది జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి చెప్పలేనంత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అల్లుళ్లతో ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

Kite String

Kite Flying Sankranti : ప్రతి ఏడాది జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి చెప్పలేనంత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అల్లుళ్లతో ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతికి పండుగకు ముందు నుంచే గాలిపటాల సందడి ఆరంభమవుతంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సంతోషంగా ఒకచోట చేరి గాలిపటాలను ఎగరేస్తు ఎంజాయ్‌ చేస్తుంటారు. అసలు గాలి పటాలను సంక్రాంతి రోజునే ఎందుకు ఎగరవేస్తారు? గాలిపటాల చరిత్ర ఏంటి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. గాలిపటాల హిస్టరీ ఈనాటిది కాదు.. దాదాపు రూ.2వేల ఏళ్ల కిందట చైనాలో గాలిపటాలను మొదటిసారిగా తయారుచేశారట.. అప్పట్లో గాలిపటాలను ఆత్మరక్షణ కోసం వినియోగించేవారట..

అలాగే ఎవరైనా ఏదైన సందేశాన్ని పంపాలంటే గాలిపటాలను వినియోగించేవారట.. అలా మిలటరీ ఆపరేషన్లలో సిగ్నలింగ్ కోసం ఈ గాలిపటాలను వాడుతు వచ్చారు. ఆనాటి గాలిపటాలను పరిశీలిస్తే.. మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. క్రీస్తుపూర్వం 206లో చైనాలోని హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభానికి ఈ గాలిపటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

హేన్‌ చక్రవర్తి తమ సైన్యంతో కోటలోకి ప్రవేశించేందుకు తొలి గాలిపటాన్ని వినియోగించారట.. సొరంగ మార్గాన్ని తవ్వేందుకు గాలిపటాన్ని ఎంత దూరం సొరంగం తవ్వాలనేది తెలుసుకునేందుకు హేన్‌ చక్రవర్తి గాలిపటానికి దారం కట్టి ఎగరవేశాడు. అలా గాలిపటం దారంతో కొలిచి సొరంగం తవ్వించాడు. అలా సైనికులను పంపి కోటను స్వాధీనం చేసుకున్నాడట.. మరి.. మకర సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఎలా వచ్చిందంటే.. మకర సంక్రాంతి పండుగ అనేక విధాలుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటారు. గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం కూడా అందుకే వచ్చింది.

మకర సంక్రాంతి రోజున అందరూ తెల్లవారుజామున లేచి సూర్యుని ఎండలో నిలబడి గాలిపటాలను ఎగరవేస్తారు. ఆ సమయంలో సూర్య కిరణాలు ఆరోగ్యకరమైనవిగా చెబుతారు. ఉదయం పూట సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. అది చర్మానికి చాలా మంచిది. చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయపడుతుంది. ఆయుర్వేదపరంగా చూస్తే.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఎండలో కాసేపు సరదాగా గడపటం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇలా సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం వచ్చింది.

Read Also : EPFO : ఖాతాదారులకు గుడ్ న్యూస్..లక్ష వరకు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే