Allu Arjun: గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సహాయం అందించిన అల్లు అర్జున్(Allu Arjun).
Allu Arjun financial assistance to senior actress Pavala Shyamala
- పావలా శ్యామలకు అండగా అల్లు అర్జున్
- ఆమెకు ప్రతీ నెల పదివేలు అందేలా ఏర్పాట్లు
- అల్లు అర్జున్ సహాయానికి నెటిజన్స్ ఫిదా
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థక సహాయాన్ని అందించాడు. ఆమె ఆరోగ్య, నిత్యావసరాల కోసం ప్రతీ నెల రూ.10 వేల రూపాయలను ఆమెకు అందించనున్నాడు. ఆ అమౌంట్ ఆమెకు ప్రతీ నెల అందేలా ఏర్పాట్లు చేశాడు. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Sneha Reddy: స్టన్నింగ్ లుక్ లో అల్లు అర్జున్ భార్య.. సిల్వర్ డ్రెస్సులో స్నేహ మెరుపులు
అల్లు అర్జున్ అందించిన ఈ సహాయానికి నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఆకాష్ పూరి, సాయి ధరమ్ తేజ్ లాంటి చాలా మంది హీరోలు పావలా శ్యామలకు ఆర్ధిక సహాయాన్ని అందించారు. కానీ, ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) ప్రతీ నెల ఆమెకు రూ.10 వేల రూపాయలు అందేలా ఏర్పాట్లు చేశాడు. ఇక టాలీవుడ్ సీనియర్ నటి ప్రస్తుతం దయనీయ స్థితిలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్నారు ఆమె. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి ఉంటున్నారు.
