Manoj- Mounika: మనోజ్- మౌనికా మూడేళ్ల వైవాహిక బంధం.. స్పెషల్ ఫొటోస్
టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి(Manoj- Mounika) ఈ రోజు తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కుమారుడు ధైరవ్తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో కలిసి మనోజ్, మౌనిక ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబందించిన స్పెషల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనోజ్, మౌనిక జంటకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ ఇద్దరి వీరిద్దరి రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు.










