SA vs NZ : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్లో అడుగుపెట్టేది ఎవరంటే?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లో (SA vs NZ) తలపడనున్నాయి.
T20 World Cup 2026 If SA vs NZ semis match abandoned due to rain who will enter into final
- బుధవారం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్
- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక
- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే కివీస్ ఇంటికే
SA vs NZ : టీ20 ప్రపంచకప్ 2026లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఇంటి ముఖం పట్టనుంది.
కాగా.. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో తలపడిన ఐదు సందర్భాల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించడం గమనార్హం. ఈ ఉత్సాహంతో సఫారీ జట్టు బరిలోకి దిగనుంది. ఆల్రౌండర్లలో నిండిన కివీస్‌ను తక్కువ అంచనా వేయలేము.
MS Dhoni : ధోనికి 1000 రూపాయల జరిమానా..!
టీ20 ప్రపంచకప్ 2026లో పలు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకవేళ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటి? ఏ జట్టు సెమీఫైనల్ కు చేరుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
గ్రూప్, సూపర్-8 దశలోని మ్యాచ్‌లకు ఐసీసీ ఎలాంటి రిజర్వ్ డేలను కేటాయించలేదు. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ కోసం మాత్రం రిజర్వ్ డేను కేటాయించింది.
వర్షం వల్ల మ్యాచ్‌కు ఆటంకం కలిగితే.. సాధ్యమైనంత మేర ఓవర్లు తగ్గించి అయినా సరే ఆ రోజే మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఐసీసీ అదనంగా 90 నిమిషాల సమయాన్ని కేటాయించింది. అయితే.. ఒకవేళ మ్యాచ్‌ను ఆ రోజు పూర్తి చేసే వీలులేని పక్షంలో ఆ మరుసటి రోజున నిర్వహిస్తారు. అయితే.. మునుపటి రోజు మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మరుసటి రోజు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఇలా కాకుండా మ్యాచ్ రోజు, రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేనట్లయితే అప్పుడు మ్యాచ్‌ను రద్దు చేస్తారు. సూపర్-8 దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది.
సూపర్-8 దశలో ఆరు పాయింట్లతో దక్షిణాఫ్రికా గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ మూడు పాయింట్లతో గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటుంది. అప్పుడు కివీస్ ఇంటి ముఖం పడుతుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.
