చర్మానికి మేలు చేసే గుమ్మడి గింజలు

గుమ్మడికాయ గింజలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. 

చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో గుమ్మడి గింజలు బాగా తోడ్పడతాయి. గుమ్మడి గింజల ద్వారా తీసిన ఆయిల్ జుట్టు సమస్యలను నివారించటంలో సహాయపడతాయి. 

పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎలకు గొప్పమూలం. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగు పరచటంలో సహాయపడతాయి. 

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి.

గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు మంచి మూలం. చర్మంపై ముడతలను నివారించి పొడిబారకుండా చేస్తాయి. 

పర్యావరణ కాలుష్యం, కఠినమైన యూవీ కిరణాల నుండి చర్మానికి అదనపు రక్షణను అందిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టానికి వ్యతిరేకంగా పోరాడతాయి. 

గుమ్మడి గింజలను మెత్తగా పొడి చేసి ఫేస్ మాస్క్ వేసుకోవటం ద్వారా చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.