Pumpkin Seeds : చర్మానికి మేలు చేసే గుమ్మడి గింజలు

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. అధిక మొత్తంలో విటమిన్ ఇ మరియు జింక్ చర్మ సంరక్షణ కీలకపాత్రపోషిస్తాయి.

Pumpkin Seeds : చర్మానికి మేలు చేసే గుమ్మడి గింజలు

Pumpkin Seed

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో గుమ్మడి గింజలు బాగా తోడ్పడతాయి. గుమ్మడి గింజల ద్వారా తీసిన ఆయిల్ జుట్టు సమస్యలను నివారించటంలో సహాయపడతాయి. ఈ గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎలకు గొప్పమూలం. ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరచటంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. అధిక మొత్తంలో విటమిన్ ఇ మరియు జింక్ చర్మ సంరక్షణ కీలకపాత్రపోషిస్తాయి. గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు మంచి మూలం. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. చర్మంపై ముడతలను నివారించి పొడిబారకుండా చేస్తాయి. చర్మం జిడ్డుగా లేకుండా మొటిమలను నివారించటంలో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. గుమ్మడి గింజలను మెత్తగా పొడి చేసి ఫేస్ మాస్క్ వేసుకోవటం ద్వారా చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

గుమ్మడి గింజల అయిల్ లో కాంప్లెక్స్ B విటమిన్లు మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి, షైన్ ను పెంచటానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె లాగానే జుట్టు ఆరోగ్యానికి గుమ్మడి గింజల అయిల్ బాగా ఉపకరిస్తుంది. గింజల్లో ఉండే జింక్ , సెలీనియం కొల్లాజెన్ స్థాయిలను పెంపొందిస్తాయి. పర్యావరణ కాలుష్యం, కఠినమైన యూవీ కిరణాల నుండి చర్మానికి అదనపు రక్షణను అందిస్తాయి.