CM Revanth Reddy : అల్లు శిరీష్ పెళ్ళిలో సీఎం రేవంత్.. ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి.. ఫోటో వైరల్..
సీఎం రేవంత్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.(CM Revanth Reddy)
CM Revanth Reddy
CM Revanth Reddy : అల్లు శిరీష్ – నయనిక పెళ్లి నేడు ఘనంగా జరుగుతుంది. కేవలం బంధుమిత్రులు, పలువురు సన్నిహితుల మధ్య ఈ వివాహం జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇటీవల నిర్వహించిన రిసెప్షన్ కి వచ్చి అల్లు శిరీష్ – నయనిక జంటకు ఆశీస్సులు తెలిపారు.
ఆ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నేడు పెళ్ళికి హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు సీఎం రేవంత్. సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. పెళ్ళిలో కొత్త జంటతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, అల్లు అరవింద్ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. సీఎం రేవంత్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.


