Rajendranagar Accident: రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురి దుర్మరణం!
రాజేంద్రనగర్(Rajendranagar Accident) టీజీ పోలీసు అకాడమీ సమీపంలో లారీని ఆటో ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Three labourers killed in fatal auto lorry accident near rajendra nagar orr
Rajendranagar Accident: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పరిధి టీజీ పోలీసు అకాడమీ సమీపంలో చోటుచేసుకున్న తీవ్ర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి బయటకు వస్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది కార్మికులు ప్రయాణిస్తుండగా, ఘటన తీవ్రతకు ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ముచ్చింతల్ నుంచి వస్తుండగా విషాదం.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు:
ముచ్చింతల్లో చెట్లు నాటే పనులు ముగించుకుని ఆటోలో శంషాబాద్ నుంచి మొయినాబాద్(Rajendranagar Accident) వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని సురేశ్, పెంటయ్య, లింగరాజుశెట్టిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
