Carmeni Selvam : సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలుగు తమిళ్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.(Carmeni Selvam)
Carmeni Selvam
Carmeni Selvam : పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కార్మేని సెల్వం. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్.. పలువురు ఈ సినిమాలో కీలా పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. కార్మేని సెల్వం సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు.
Also Read : Mension House Mallesh : ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ.. తాగుబోతుకి శృంగారంలో ఆ సమస్య ఉంటే..
నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం, అతని చుట్టూ తిరిగే కథ, ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే కథాంశంతో ఎమోషనల్ గా ఈ సినిమా ఉండనుంది.

తాజాగా ఈ సినిమా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ.. కార్మేని సెల్వం ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా సినిమాకి థియేట్రికల్ పార్ట్నర్గా ఉండటం వల్ల ఈ కథ చాలామంది ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం అని అన్నారు.
