CM Revanth Reddy : సైన్స్ మ్యూజియంలో విద్యార్థుల ప్రయోగాలు.. ఆసక్తిగా పరిశీలించిన సీఎం రేవంత్.. వీడియో వైరల్
CM Revanth Reddy : కోస్గి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
CM Revanth Reddy inaugurated the Sir CV Raman Science Museum building in Kosgi
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కొడంగల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం.. పలు భవనాలను ప్రారంభించారు. ఈ క్రమంలో కోస్గి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Also Read : CM Revanth Reddy : ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు.. అక్కడే భోజనం.. ఫొటోలు వైరల్..
అన్ని హంగులతో నిర్మించిన ఈ మ్యూజియం భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా పరికరాల పనితీరును విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించగా.. సీఎం ఆసక్తిగా తిలకించారు.
శాస్త్రీయ అంశాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రయోగాల ద్వారా నేర్చుకునేలా ఈ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో అన్ని హంగులతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం మ్యూజియంలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. ఆయా పరికరాల పనితీరును విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
#Kodangal #Narayanpet #Kosgi #ScienceMuseum
— Telangana CMO (@TelanganaCMO) November 8, 2026
