Happy Diwali Gifts 2026 : దీపావళి గిఫ్ట్స్ ఇంకా కొనలేదా? బ్లింకిట్, జెప్టోలో ఈ 5 గ్యాడ్జెట్స్ రెడీ.. క్షణాల్లో ఇంటికే డెలివరీ..!
Happy Diwali Gifts 2026 : దీపావళి 2026 సందర్భంగా చివరి నిమిషంలో గిఫ్ట్స్ కొనాలనుకుంటున్నారా? బ్లింకిట్, జెప్టోలో లభించే అమెజాన్ ఎకో డాట్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ సహా 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్, వాటి ధరలివే..
Happy Diwali Gifts 2026
- పండుగ వేళ అదిరిపోయే సర్ప్రైజ్..
- మీ ఇంటికే వచ్చే 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్
- దీపావళికి ఈ స్మార్ట్ గిఫ్ట్స్ పంపించేయండి
Happy Diwali Gifts 2026 : దీపావళి వచ్చిందంటే ఇళ్లలో పండుగ సందడే సందడి.. కొత్త బట్టలు, స్వీట్లు, పూజా కార్యక్రమాలతో పాటు ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వడం కూడా ఈ పండుగలో ఓ ప్రత్యేకమైన ఆనవాయితీ. అయితే, చివరి నిమిషం వరకు గిఫ్ట్స్ కొనడం మర్చిపోయారా?
అయితే, కంగారు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో కొన్ని ఆసక్తికరమైన టెక్ గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన 5 బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. అమెజాన్ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ :
టెక్నాలజీని ఇష్టపడే వారికి బెస్ట్ గిఫ్ట్.. అలెక్సా+ సపోర్ట్‌తో వచ్చే ఈ 5వ జనరేషన్ స్మార్ట్ స్పీకర్ ధర రూ.3,999కు లభిస్తుంది. పాటలు వినడం, న్యూస్ తెలుసుకోవడం వంటి పనులను వాయిస్ కమాండ్స్‌తో చేయొచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషలకు సపోర్ట్ చేస్తుంది..
2. బోట్ బ్లేజ్ హెచ్డీ స్మార్ట్‌వాచ్ :
ఫిట్నెస్, స్మార్ట్‌వాచ్‌లపై ఆసక్తి ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్.. బ్లింకిట్‌లో ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,399కు లభిస్తుంది. 1.83 అంగుళాల డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి..
3. గోబౌల్ట్ మస్టాంగ్ టార్క్ ఇయర్‌బడ్స్ :
మ్యూజిక్ లవర్స్‌కు ఈ ఇయర్‌బడ్స్ నచ్చుతాయి. రూ.1,499 ధరతో లభించే ఇందులో బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 60 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయని కంపెనీ పేర్కొంటోంది.
4. పోర్ట్రానిక్స్ సౌండ్పాట్ ప్రో స్పీకర్ :
పార్టీలు, పండుగ వేడుకలకు మంచి ఆప్షన్. జెప్టోలో రూ.2,147 ధరకు లభించే ఈ స్పీకర్ 20W సౌండ్ అవుట్‌పుట్, RGB లైట్స్‌తో వస్తుంది. 6 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది.
5. నాయిస్ ఎయిర్‌వేవ్ మ్యాక్స్ 4 హెడ్‌ఫోన్స్ :
మ్యూజిక్ వినేందుకు ఇష్టపడేవారికి మరో మంచి గిఫ్ట్. జెప్టోలో వీటి ధర రూ.2,399. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పాటు 70 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి..
మొత్తానికి, ఈ దీపావళికి ఖరీదైన బహుమతులే ఇవ్వాలన్న రూలేమి లేదు. మనసుకు నచ్చిన వారికి చిన్న గ్యాడ్జెట్ ఇచ్చినా ఆనందమే. అయితే, ఆర్డర్ చేసే ముందు మీ ప్రాంతంలో స్టాక్, ధర, డెలివరీ టైమ్ మస్ట్ చెక్ చేసుకోండి.
