Chinna Jeeyar Swamy Birthday: ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా చిన్న జీయర్ స్వామి 70వ జన్మదిన వేడుకలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం!
ముచ్చింతల్ శ్రీరామనగరంలో త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy Birthday)వారి 70వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది.
Tridandi chinna jeeyar swamy 70th birthday celebrations grandly held at muchintal
Chinna Jeeyar Swamy Birthday: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy Birthday) వారి 70వ తిరునక్షత్ర మహోత్సవం (జన్మదినోత్సవం) అత్యంత ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లుతున్న సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణం గురుదేవుల తిరునక్షత్ర శుభసందర్భంగా అపూర్వమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశవిదేశాల నుంచి పీఠాధిపతులు, వేదపండితులు, వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో శ్రీరామనగరం దివ్యధామంగా మారింది.
LPG Gas OTP: ఏపీలో ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. OTP లేకుండానే డెలివరీ.. కీలక నిబంధన సడలింపు!
ప్రత్యేక పూజలు, మంగళ శాసనాలు.. వేడుకల్లో మైహోమ్ రామేశ్వరరావు:
ఈ పవిత్ర మహోత్సవం సందర్భంగా శ్రీరామనగరంలో ప్రత్యేక హవనాలు, వేద పారాయణాలు, శ్రీరామానుజాచార్యుల దివ్యమంగళ విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు స్వయంగా పాల్గొని చిన్న జీయర్ స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రణామాలర్పించి దివ్య మంగళ శాసనాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో సమాజానికి మరిన్ని సేవలు అందించే భాగ్యం కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు.. భక్తిపారవశ్యంలో మునిగిన శ్రీరామనగరం:
జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీరామనగరానికి వేలాదిగా విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఉచిత అన్నప్రసాద వితరణతో పాటు తాగునీరు, వైద్య సదుపాయాలు, దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించారు. స్వామివారి అమృత ప్రవచనాలు ఆలకించి, దర్శనభాగ్యం పొందిన భక్తులు పరవశించిపోయారు. ప్రాంగణమంతా “శ్రీమతే రామానుజాయ నమః” నామస్మరణతో ప్రతిధ్వనించింది.
