AP ZPTC MPTC Elections Results : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై ఎస్ఈసీ కీలక ప్రకటనలు.. ఏ పార్టీకి ఎన్నిసీట్లొచ్చాయి..? జిల్లాల వారి లిస్టు ఇదే..
AP ZPTC MPTC Elections Results : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
AP ZPTC MPTC Elections Results
AP ZPTC MPTC Elections Results : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం తుది ఫలితాలను ప్రకటించింది.
Also Read : Bank Holiday : నవంబర్ 9న బ్యాంకులు తెరిచే ఉంటాయా? సోమవారం స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసుల సెలవులపై క్లారిటీ!
ఎస్ఈసీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. టీడీపీ 406, వైకాపా 76, జనసేన 73, బీజేపీ 20, స్వతంత్రులు 6, సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించాయి.
అదేవిధంగా 7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. టీడీపీ 4,806, వైసీపీ 1,711, జనసేన 938, బీజేపీ 117, స్వతంత్రులు 169, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 15, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందాయి.
జిల్లాల వారిగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందో ఫైనల్ లిస్ట్ ఇదే..

