భారత్‌లోకి ఎట్టకేలకు 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులను తీసుకొచ్చాయి.

వినియోగదారులు తమ డివైజ్‌లలో 5G యాక్టివ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

5G సర్వీసులను యాక్టివ్ చేసేందుకు సైబర్ మోసగాళ్ళు కస్టమర్‌లను మోసగించడానికి అవకాశంగా చూస్తారు.

మీ ఫోన్‌లలో 5Gని యాక్టివేట్ చేస్తామంటూ నమ్మించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ మోసగాళ్లు 5G పేరుతో లింక్‌లను పంపుతున్నారని మల్టీ సిటీలు, రాష్ట్రాల పోలీసు విభాగాలు పౌరులను హెచ్చరిస్తున్నారు.

అలాంటి లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.

అప్రమత్తంగా లేకుంటే రిస్క్ తప్పదు 

4G నుంచి 5G సిమ్‌కి అప్‌గ్రేడ్ చేసేందుకు లింక్‌లను పంపడం ద్వారా మీ అకౌంట్లు ఖాళీ అవుతాయి.