5G Scam Alert : 4G to 5G యాక్టివేషన్ అంటూ సైబర్ మోసగాళ్లు ఎన్ని మార్గాల్లో మోసం చేయొచ్చుంటే? తస్మాత్ జాగ్రత్త!

5G Scam Alert : భారత్‌లోకి ఎట్టకేలకు 5G సర్వీసులు (5G Services In India) అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

5G Scam Alert : 4G to 5G యాక్టివేషన్ అంటూ సైబర్ మోసగాళ్లు ఎన్ని మార్గాల్లో మోసం చేయొచ్చుంటే? తస్మాత్ జాగ్రత్త!

5G scam alert! Ways in which fraudsters may cheat you

5G Scam Alert : భారత్‌లోకి ఎట్టకేలకు 5G సర్వీసులు (5G Services In India) అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వినియోగదారులు తమ డివైజ్‌లలో 5G యాక్టివ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 5G సర్వీసులను యాక్టివ్ చేసేందుకు సైబర్ మోసగాళ్ళు కస్టమర్‌లను మోసగించడానికి దీన్నే అవకాశంగా చూస్తారు. మీ ఫోన్‌లలో 5Gని యాక్టివేట్ చేస్తామంటూ నమ్మించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ మోసగాళ్లు 5G పేరుతో లింక్‌లను పంపుతున్నారని మల్టీ సిటీలు, రాష్ట్రాల పోలీసు విభాగాలు పౌరులను హెచ్చరిస్తున్నారు. అలాంటి లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా లేకుంటే రిస్క్ తప్పదు. 4G నుంచి 5G సిమ్‌కి అప్‌గ్రేడ్ చేసేందుకు లింక్‌లను పంపడం ద్వారా మీ అకౌంట్లు ఖాళీ అవుతాయి.

సంబంధిత టెలికాం కంపెనీల పేర్లతో లింక్‌లు పంపే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ముంబై పోలీసులు రిస్క్ అలర్ట్.. అప్‌గ్రేడేషన్ ఇన్ టెక్ అనే ట్వీట్‌ను షేర్ చేశారు. ఇటీవల మోసగాళ్లు 5Gకి మార్చడానికి మిమ్మల్ని నమ్మించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత/బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయవద్దు. అలాగే తెలియని లింక్‌లపై అసలు క్లిక్ చేయవద్దని గురుగ్రామ్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

5G scam alert! Ways in which fraudsters may cheat you

5G scam alert! Ways in which fraudsters may cheat you

గురుగ్రామ్‌లో 5G ప్రారంభానికి సంబంధించి వార్తలు వచ్చినప్పటి నుంచి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అక్కడి నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, OTPలను ఎవరితోనూ షేర్ చేయరాదని సూచిస్తున్నారు. 5Gకి అప్‌గ్రేడ్ చేయడంలో సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మోసగాళ్లు మీ బ్యాంక్ వివరాలను లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో లేదా SMS ద్వారా షేర్ చేయవద్దని చూసిస్తున్నారు. ఇంతకీ ఈ స్కామర్లకు ఎలాంటి మార్గాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందో లేదో ఓసారి చూడండి..

* మీరు 4G నుంచి 5Gకి అప్‌గ్రేడ్ చేసేందుకు మీ ఫోన్‌లో లింక్‌ని అందుకోవచ్చు. ఈ లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
* స్కామర్‌లు టెలికాం ఆపరేటర్ ప్రతినిధిగా నమ్మిస్తూ.. మీకు కాల్ చేసి OTPలు లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడగవచ్చు. మీ వివరాలను షేర్ చేయవద్దు.
* మీరు 4G నుంచి 5Gకి అప్‌గ్రేడ్ చేసేందుకు కొన్ని మెసేజ్‌లను అందుకోవచ్చు. అలాంటి మెసేజ్‌లను ఎప్పుడూ కూడా క్లిక్ చేయవద్దు
* మోసగాళ్లు మీకు కాల్ చేసి, 5G సర్వీసులకు అప్‌గ్రేడ్ చేసేందుకు బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడగవచ్చు. వారితో ఎలాంటి వివరాలు పంచుకోవద్దు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్లు.. ఆ 4 నగరాల్లో మాత్రమే.. 5G యాక్టివేట్ ఎలా చేసుకోవాలో తెలుసా?