WhatsApp Child Accounts : 13ఏళ్ల లోపు పిల్లల కోసం కొత్త వాట్సాప్.. ఇక ప్రతి చాట్ పేరెంట్స్‌కు తెలుస్తుంది.. ఎలాగంటే? ఫుల్ డిటెయిల్స్!
WhatsApp Child Accounts : చిన్న పిల్లల కోసం అకౌంట్లను ఇప్పుడు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో క్రియేట్ చేయొచ్చు. తల్లిదండ్రుల డివైజ్ ద్వారా లింక్ అవుతాయి. మెసేజింగ్, కాలింగ్ ఫీచర్లు మాత్రమే ఉంటాయి.
WhatsApp Child Accounts
- వాట్సాప్‌లో పిల్లల కోసం సరికొత్త ఫీచర్
- 13ఏళ్ల లోపు పిల్లలకు వాట్సాప్ అకౌంట్లు
- పేరెంట్స్ డివైజ్ ద్వారా అకౌంట్లను కంట్రోల్ చేయొచ్చు
WhatsApp Child Accounts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇకపై చిన్న పిల్లలు కూడా వాట్సాప్ వాడొచ్చు. పిల్లల కోసం తల్లిదండ్రులే వాట్సాప్ లో అకౌంట్లను క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్త వాట్సాప్ అకౌంట్ ఫీచర్ ప్రవేశపెడుతున్నట్లు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
ఈ వాట్సాప్ అకౌంట్లలో కాల్ చేయడం, మెసేజ్ పంపడంపై మాత్రమే ఉంటుంది. ఈ అకౌంట్లు పూర్తిగా పేరెంట్స్ వారి పిల్లల కమ్యూనికేషన్లపై పూర్తి కంట్రోల్ అందిస్తాయి. ఈ కొత్త ఫీచర్ రాబోయే కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది.
పిల్లల అకౌంట్లు ఎలా పనిచేస్తాయి? :
వాట్సాప్ కొత్త పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్లు కొత్త డిఫాల్ట్ సెట్టింగ్స్, పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ వాట్సాప్ అకౌంట్లు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎవరు కాంటాక్ట్ చేయాలి? ఏ గ్రూపులలో జాయిన్ అవ్వాలో డిసైడ్ చేస్తారు.
ఈ వాట్సాప్ అకౌంట్ల కోసం ప్రైవసీ సెట్టింగ్‌లను కూడా పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. అయితే, అన్ని వ్యక్తిగత చాట్స్ సాధారణ అకౌంట్ల మాదిరిగానే ప్రైవేట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. మెటా ఏఐ, ఛానెల్‌లు, స్టేటస్, వన్-ఆన్-వన్ చాట్స్ ఒకసారి వ్యూ చూడటం వంటి ఫీచర్లు ఉండవు.
పిల్లల అకౌంట్లు, తల్లిదండ్రుల ఫోన్లకు లింక్ :
నివేదికల ప్రకారం.. ఈ వాట్సాప్ అకౌంట్లను సెటప్ చేసేందుకు తల్లిదండ్రులు వారి సొంత డివైజ్, వారి పిల్లల డివైజ్ సమీపంలో ఉండాలి. ఈ రెండు అకౌంంట్లు QR కోడ్ ద్వారా లింక్ అవుతాయి. సెటప్ తర్వాత తల్లిదండ్రులు గుర్తుతెలియని కాంటాక్టుల నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్ట్‌లను కూడా రివ్యూ చేయొచ్చు.
వాట్సాప్ పేమెంట్ సబ్స్క్రిప్షన్ ఏంటి? :
వాట్సాప్ త్వరలో వాట్సాప్ ప్లస్ అనే పేమెంట్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టనుంది. స్పెషల్ స్టిక్కర్లు, థీమ్‌లు, కొత్త యాప్ ఐకాన్, కొత్త చాట్ ఇంటర్ఫేస్తో సహా అనేక కొత్త ఫీచర్లను యాడ్ చేయనుంది. ప్రస్తుతాానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజీలోనే ఉంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. పేమెంట్ సబ్ స్క్రిప్షన్, కాలింగ్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్లు ఫ్రీగానే యాక్సస్ చేయొచ్చు.
