Vivo T5x 5G : వివో క్రేజే వేరబ్బా.. 7200mAh బ్యాటరీతో కొత్త వివో T5x 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T5x 5G : వివో నుంచి సరికొత్త 5జీ వెర్షన్ రాబోతుంది. వివో T5x 5G ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. ఈ కొత్త వివో ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
Vivo T5x 5G
- వివో T5x ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా
- 2025లో వచ్చిన వివో T4x ఫోన్ అప్ గ్రేడ్ వెర్షన్
- 7200mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమన్షిటీ 7400 టర్బో ప్రాసెసర్
Vivo T5x 5G : వివో లవర్స్ కు గుడ్ న్యూస్.. వివో T5x 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 17న అధికారికంగా లాంచ్ కానుంది. వివో కంపెనీ టీ-సిరీస్ లైనప్‌ను విస్తరిస్తుంది. సాధారణంగా బడ్జెట్, మిడ్ రేంజ్ కేటగిరీలో గట్టి పోటీ ఉంటుంది. రాబోయే వివో T5x 5జీ ఫోన్ బ్యాటరీ, మన్నిక, చిప్సెట్ వివరాలను కంపెనీ ధృవీకరించింది. మెరుగై పర్ఫార్మెన్స్ కోసం మరిన్ని అప్గ్రేడ్లతో వస్తుంది.
వివో T5x 5జీ ఫోన్ కంపెనీ ప్రీమియం వివో V70 సిరీస్ మాదిరిగా డిజైన్ ఉన్నట్టు కనిపిస్తోంది . అధికారిక టీజర్ ఫొటోలను పరిశీలిస్తే ఇలాంటి కెమెరా మాడ్యూల్ లేఅవుట్, క్లీన్ రియర్ ప్యానెల్ డిజైన్ ఉన్నాయి. మిడ్ రేంజ్ పొజిషనింగ్ ఉన్నప్పటికీ ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్ ఉంటుంది.
భారీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ :
వివో T5x అతిపెద్ద ఫీచర్లలో 7,200mAh బ్యాటరీ ఒకటి. గేమింగ్, స్ట్రీమింగ్, రోజువారీ వినియోగానికి బ్యాటరీ అద్భుతంగా ఉంటుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 టర్బో ప్రాసెసర్ అందిస్తుంది. అద్భుతమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
మిలియన్ పాయింట్లకు పైగా AnTuTu స్కోర్‌ను సాధించింది. లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS6 తో కూడా వస్తుంది. వివో T5x ఫోన్ IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. వివో T4x ఫోన్ మాత్రం కేవలం IP64 రేటింగ్ మాత్రమే అందిస్తుంది.
ధర వివరాలు (అంచనా) :
వివో ఇంకా పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. వివో T5x 5జీ బ్యాటరీ లైఫ్, మన్నిక, పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. వివో T5x ధర రూ. 23,000 కన్నా తక్కువగా ఉండవచ్చు. రూ. 13,999 వద్ద లాంచ్ అయిన వివో T4x కన్నా ధర ఎక్కువగా ఉండొచ్చు. ప్రస్తుతం వివో T4x ధర రూ. 16,999గా ఉంది.
భారత మార్కెట్లో వివో T5x 5G ఫోన్ మార్చి 17న మధ్యాహ్నం 12 గంటలకు వివో అధికారికంగా లాంచ్ చేయనుంది. ధర, కెమెరా స్పెసిఫికేషన్లు, లభ్యతతో సహా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
