Amazon Diwali Discount : దీపావళి బంపర్ ఆఫర్.. ఈ 5G ఫోన్ ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!
Amazon Diwali Discount : లావా బోల్డ్ 5జీ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. 6000mAh బ్యాటరీ, 13MP ప్రైమరీ కెమెరాతో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Amazon Diwali Discount
- రూ.12వేల కన్నా తక్కువ ధరకే 6000mAh బ్యాటరీతో 5జీ ఫోన్
- అమెజాన్‌లో లావా బోల్డ్ N2 5జీ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది
- 6000mAh బ్యాటరీ సెటప్, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో
Amazon Diwali Discount : దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ఎడిషన్’ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.12వేల బడ్జెట్లో భారీ బ్యాటరీతో కొత్త 5జీ ఫోన్ కోసం చూస్తుంటే లావా బోల్డ్ N2 5జీ బెస్ట్ ఆప్షన్..
ప్రస్తుతం, ఈ లావా బోల్డ్ 5జీ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. తద్వారా ధర మరింత తగ్గుతుంది. లావా బోల్డ్ N2 5జీలో 6000mAh బ్యాటరీ, 13MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. పూర్తి ఆఫర్లు, ధర వివరాలివే..
లావా బోల్డ్ N2 5జీ ధర, ఆఫర్లు :
లావా బోల్డ్ N2 5జీ ఫోన్ (4GB/64GB స్టోరేజ్ వేరియంట్) ఈ-కామర్స్ సైట్లో రూ.12,998కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.1,250 వరకు) లభిస్తుంది. ధర రూ.11,748 అవుతుంది.
Read Also : Govt Jobs Update : తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 15 వేల ఉద్యోగాలపై కీలక అప్డేట్!
లావా బోల్డ్ N2 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
లావా బోల్డ్ N2 5జీలో 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.75-అంగుళాల 2.5డీ నాచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ UNISOC T8200 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
లావా బోల్డ్ N2 5జీ ఫోన్ బ్యాక్ కెమెరా సెటప్‌లో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్-సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, ఓటీజీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది.
