Kanya Rasi Phalalu 2026 : కన్య రాశి వారికి తిరుగే లేదు.. అన్ని రంగాల్లో విజయం, ధన లాభం, మంచి ప్యాకేజీతో జాబ్.. మీ పంట పండింది పో..!
Kanya Rasi Phalalu 2026 : ఈ సంవత్సరం కన్య రాశి వారి ఫలితాలు ఎలా ఉండనున్నాయంటే..
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 kanya rasi phalalu Virgo horoscope
Kanya Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశుల్లో కన్య రాశి వారు ముందు వరుసలో ఉన్నారు. ఇక ఈ రాశి వారికి తిరుగే ఉండదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అదృష్టం తలుపుతట్టిందని.. ఇన్నాళ్ల నుంచి పడ్డ బాధలకు విముక్తి లభించబోతుందని తెలిపారు. ఈ సంవత్సరం కన్య రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు, ధన లాభం, విజయం, నిరుద్యోగులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని పనులు సులభంగా పూర్తవుతాయని తెలిపారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారని.. ఆదాయం కూడా బాగానే ఉంటుందని తెలిపారు. కన్య రాశి అన్ని వర్గాల వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుందని తెలిపారు.
కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం: 8, వ్యయం: 11.. రాజపూజ్యం: 3, అవమానం: 3 ఉన్నాయని.. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచే కలిసి వస్తుందని తెలిపారు. పెండింగ్ పనులు పూర్తవుతాయని.. పాత బాకీలు వసూలు అవుతాయన్నారు. అలానే ఈ రాశి వారు కొత్త వాహనం, ఇల్లు కొంటారని.. శత్రువులు కూడా మిత్రులుగా మారతారని తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుందని.. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయన్నారు. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడమే కాక కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద ఉండి ఆనందంగా గడుపుతారని తెలిపారు.
రంగాల వారీగా ఫలితాలు
- విద్యార్థులు: ఈ సంవత్సరం కన్య రాశి విద్యార్థులు చదువులో విపరీతమైన పట్టుదల చూపిస్తారని.. ఫలితంగా మంచి ర్యాంకులు సాధించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం పొందుతారని అంటున్నారు.
- ఉద్యోగస్థులు: ఈ ఏడాది కన్య రాశి ఉద్యోగులకు బాగా కలిసి వస్తుందని.. కోరుకున్నట్లు ప్రమోషన్లు, బదిలీలు (Transfers) లభిస్తాయని తెలిపారు. అలానే నిరుద్యోగులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందన్నారు.
- వ్యవసాయదారులు: కన్య రాశి అన్నదాతలకు ఈ సంవత్సరం పంటలు బాగా పండి.. అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు.
- వ్యాపారస్తులు: కొత్త వ్యాపారాలు లేదా ఏజెన్సీలు ప్రారంభిస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయంటున్నారు.
- కళాకారులు, క్రీడాకారులు: కన్య రాశి క్రీడాకారులు, కళాకారులకు ఈ ఏడాది విపరీతమైన పేరు, డబ్బు సంపాదిస్తారు. అలానే కన్య రాశి సినీ నిర్మాతలు భారీగా లాభాలు పొందుతారని తెలిపారు.
- రాజకీయ నాయకులు: ప్రజల్లో గుర్తింపు మరియు పలుకుబడి పెరుగుతుంది. చాకచక్యంతో సమస్యలను పరిష్కరిస్తారు.
- స్త్రీలు: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంది. ఇంటిని విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటారు.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
ఉత్తర (2, 3, 4 పాదాలు ) మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027) బుధ, గురు, శని 2, 4, 8, 9
హస్త (1-4 పాదాలు) మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్, జనవరి (2027) గురు, శని 1, 3, 5, 7
చిత్త (1, 2 పాదాలు) ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027) మంగళ, బుధ, శని 2, 3, 4, 6
పరిహారాలు-పూజలు:
కన్య రాశి వారు మరింత మెరుగైన ఫలితాల కోసం శని, రాహు, కేతు గ్రహాలకు పూజలు చేయాలని.. అలానే మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు దానం చేయాలని సూచిస్తున్నారు.
- దైవ దర్శనం: వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను దర్శించుకోవాలి.
- స్తోత్ర పఠనం: ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రం చదవడం లేదా వినడం మంచిది. గోవింద నామాలను పఠించడం శ్రేయస్కరం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
