My Home: మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వైభవంగా వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
My Home: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ములకలాపల్లిలో వ్యూహ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు 4 రోజుల పాటు జరగనున్నాయి. ప్రస్తుతం యాగశాలలో ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం యాగశాలలో నిత్యారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం, తీర్ధ ప్రసాద గోష్టి, తదియారాధన ఉంటుంది. శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.
శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, వైస్ చైర్మన్ వినోద్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి రంజిత్ కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేంకకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవానికి భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Also Read: రేపే వరుథిని ఏకాదశి.. ఉపవాసం ఉండి, ఇలా చేస్తే ఎంతో పుణ్యం..
