Ajay Bhupathi : ‘యు/ఏ’ రేటింగ్ ఇచ్చినందుకు బాధపడ్డ దర్శకుడు.. ఎవరైనా ‘ఏ’ వద్దంటారు.. ఈయనకేమో ‘A’ నే కావాలంట..
ఏ రేటింగ్ ఇస్తే 18 ఏళ్ళ లోపు పిల్లలను ఆ సినిమాలకు రానివ్వరు. (Ajay Bhupathi)
Ajay Bhupathi
Ajay Bhupathi : థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా సెన్సార్ అవ్వలసిందే. ఆ సినిమాలకు సెన్సార్ బోర్డు రేటింగ్ ఇస్తుంది. ఆ సినిమాలో ఉన్న రక్తపాతం, శృంగారం, బూతులు, ఫైట్స్, డైలాగ్స్.. ఇలాంటి కంటెంట్ ని బట్టి రేటింగ్స్ ఇస్తారు. ఇవేమి లేకపోతే క్లీన్ యు, కొంతమేరకు ఉంటే యు/ఏ, ఎక్కువగా ఉంటే ఏ రేటింగ్స్ ఇస్తారు. అందరూ యు లేదా యు/ఏ రేటింగ్స్ తమ సినిమాలకు కావాలనుకుంటారు. కొంతమంది మాత్రమే ఏ ఇచ్చినా పర్లేదు అనుకుంటారు. ఏ రేటింగ్ ఇస్తే 18 ఏళ్ళ లోపు పిల్లలను ఆ సినిమాలకు రానివ్వరు.
దానివల్ల సినిమాకు కలెక్షన్స్ తగ్గుతాయని, ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని సినిమా వాళ్ళు భావిస్తారు. ఇటీవల దీవానా, కపుల్ ఫ్రెండ్లీ.. లాంటి పలువురు సినిమా వాళ్ళు కూడా మా సినిమాలో ఏమి లేకపోయినా ఏ రేటింగ్స్ ఇచ్చారని గొడవ చేసారు. యు/ఏ ఇవ్వాల్సింది సెన్సార్ బోర్డు ఏ ఇస్తుందని సెన్సార్ వాళ్లపై విమర్శలు కూడా చేసారు పలువురు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా శ్రీనివాస మంగాపురం సినిమా దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఏ రేటింగ్ ఇచ్చినందుకు బాధపడ్డాడట.
Also Read : Disha Patani : వెల్కమ్ టు ది జంగిల్.. సాంగ్ స్టిల్స్ షేర్ చేసిన దిశా పటాని..
మహేష్ అన్న కొడుకు జైకృష్ణ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. నా అన్ని సినిమాలకు A రేటింగ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాకు యూ/ఏ ఇచ్చారు. నేను ఏ అనుకొనే సెన్సార్ దగ్గరికి వెళ్ళాను. ఏ ఇవ్వాలి, ఇస్తే బాగుండు అనుకున్నాను. కానీ యు/ఏ ఇచ్చినందుకు బాధపడ్డాను.
కొన్ని కట్స్ ఇచ్చారు. బూతులు లాంటివి కొన్ని తీసేయమన్నారు. దాదాపు ఓ పది కట్స్ ఇచ్చారు. నేను అయితే ఒప్పుకోను కానీ నిర్మాత ఓకే అన్నారు. అందుకే ఈ సినిమా యు/ఏ అయింది. నేనే నిర్మాత అయితే ఆ కట్స్ ఏమి లేకుండా ఏ రేటింగ్ ఇమ్మంటాను. ఈ సినిమా జానర్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి నేను కూడా ఒప్పుకోక తప్పలేదు అని అన్నారు. దీంతో ఏ రేటింగ్ వద్దనుకునే దర్శక నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో అజయ్ భూపతి ఏ రేటింగ్ ఇవ్వనందుకు బాధపడ్డాడు అని చెప్పడం చర్చగా మారింది.
