MeeSeva Toll Free: ఇక ఇంటివద్దకే ‘మీ సేవ’ సేవలు.. టోల్‌ఫ్రీ నంబర్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు!
మీ సేవా సేవలను నేరుగా ఇంటి వద్దకే అందించే 'మీ సేవ డోర్‌స్టెప్(MeeSeva Toll Free)' పోస్టర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
Minister Sridhar Babu launches Meeseva toll-free number 1100
MeeSeva Toll Free: తెలంగాణ పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించే దిశగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక అడుగు వేశారు. ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే చేర్చేందుకు ఉద్దేశించిన ‘మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ(MeeSeva Toll Free)’ సేవల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పౌరులు మీ సేవా కేంద్రాలు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సుదీర్ఘమైన క్యూలలో నిలబడే ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెడుతూ ప్రభుత్వం ఈ నూతన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Akash Agarwal: వ్యవస్థపై నమ్మకం పోయింది.. ఇస్లాంలోకి మారుతాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఆకాష్ అగర్వాల్
ఇంటి వద్దకే ఆరు రకాల సేవలు.. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌తో బుకింగ్:
ఈ పథకం ద్వారా ఆదాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ నమోదు, వివరాల అప్డేట్ సేవలను నేరుగా ఇంటి వద్ద నుంచే పొందే వెసులుబాటు లభిస్తుంది. ప్రజలు కేవలం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మీ సేవా పౌరుల పోర్టల్ ద్వారా తమకు కావలసిన సమయానికి (స్లాట్) సేవలను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న సమయానికి మీ సేవా ప్రతినిధులు నేరుగా ఇంటికే వచ్చి అవసరమైన వివరాలను నమోదు చేసుకుని, నిబంధనల ప్రకారం వర్తించే రుసుముతో సేవలందిస్తారు.
గ్రేటర్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్.. తొలి నెలలోనే విశేష స్పందన:
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ (CURE) పరిధిలోని ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ డోర్‌స్టెప్ సేవలకు ప్రారంభమైన తొలి నెలలోనే ప్రజల నుండి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఏకంగా 3,885 కాల్స్ రావడం ఈ వ్యవస్థ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా, మున్ముందు ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సాంకేతిక సంస్కరణలు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
