MS Dhoni : CSK vs KKR మ్యాచ్.. ధోని అభిమానులకు అలర్ట్.. నేటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..!
MS Dhoni : నేడు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగబోయే CSK vs KKR మ్యాచ్ లో ధోని ఆడతాడా.. సీఎస్కే ఏమంటుందంటే..
IPL 2026 ms dhoni He will not be available to play csk vs kkr
- నేడు CSK vs KKR మ్యాచ్
- ధోని అభిమానులకి బ్యాడ్ న్యూస్
- నేటి మ్యాచ్ కి దూరంగా ధోని
MS Dhoni : ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మంగళవారం నాడు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి కేకేఆర్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఇకపోతే సీఎస్కే మూడు మ్యాచుల్లో ఓడిపోయి.. ఒక్క విజయంతో ఖాతా తెరిచింది. ఈ క్రమంలో బోణీ కొట్టాలనే కసితో కేకేఆర్ బరిలోకి దిగుతుండగా.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని సీఎస్కే టార్గెట్‌గా పెట్టుకుంది. నేడు జరగబోయే సీఎస్కే వర్సెస్ కేకేఆర్ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ ధోనీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మిస్టర్ కూల్ నేడు చెపాక్‌లో చెలరేగేందుకు బరిలోకి దిగుతున్నాడా.. లేదంటే మరికొంత కాలం జట్టుకు దూరంగానే ఉండబోతున్నాడా అంటే..
మంగళవారం జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు ముందు.. ఎంఎస్ ధోనీ అభిమానులకు నిరాశ కలిగించే వార్త తెలిసింది. ఈ మ్యాచ్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. సోమవారం చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ధోనీ చాలా కొద్ది సమయం మాత్రమే నెట్లో బ్యాటింగ్ చేశాడు. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
కాఫ్ స్ట్రెయిన్ (Calf Strain) కారణంగా ధోనీ టోర్నమెంట్ తొలి రెండు వారాలకు దూరమయ్యాడు. మార్చి 28న సీజన్ ప్రారంభ రోజు నుంచి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్ 2026 ప్రారంభంలో రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉంటాడని, ఆ సమయంలో అతడు రిహాబిలిటేషన్‌లో ఉంటాడని సీఎస్కే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం మొత్తం జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసిన ధోనీ.. నేడు జరగబోయే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్‌లో ఆడతాడని అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం ధోనీ మరికొంత కాలం ఆడలేడని తెలిసింది.
*ఐపీఎల్ 2026లో షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు..
ఐపీఎల్ 2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని రూ. 4 కోట్లకు “అన్క్యాప్డ్” ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. తన ఐపీఎల్ కెరీర్లో ధోనీ 278 మ్యాచ్‌లలో 5,439 పరుగులు చేసి, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. అయితే ప్రస్తుతం ధోనీ గైర్హాజరు జట్టుకు, అభిమానులకు పెద్ద నిరాశగా మారింది.
