IPL 2026 : ఐపీఎల్ 2026లో షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు..
బీసీసీఐ ఐపీఎల్ 2026 (IPL 2026)షెడ్యూల్లో స్వల్ప మార్పులను చేసింది.
IPL 2026 GTvs CSK fixtures swapped for April 26 and May 21 (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసిన బీసీసీఐ
- చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌ల వేదికల మార్పు
- అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలే కారణం
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో బీసీసీఐ ఐపీఎల్ 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులను చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను స్వాప్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికను చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మార్చారు.
ఇక మే 21న ఈ రెండు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చారు.
