Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్ ఇంట్లో ఆనందం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య విని రామన్
Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు.
Glenn Maxwell
Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్, భారత సంతతికి చెందిన ఆయన భార్య విని రామన్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. విని రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమార్తెకు మైయా మాక్స్వెల్ (Maia Maxwell) అని పేరు పెట్టినట్లు ఈ దంపతులు వెల్లడించారు.
Also Read : India vs Sri Lanka 1st Test : మానవ్ సుతార్ మ్యాజిక్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం..
మంగళవారం మాక్స్వెల్, విని రామన్ సంయుక్తంగా సోషల్ మీడియాలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ పాప ఫొటోను షేర్ చేస్తూ.. “మా కలల అమ్మాయి వచ్చేసింది.. మైయా మాక్స్వెల్” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్టుపై క్రికెటర్లు, క్రికెట్ ఫ్రాంచైజీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
గ్లెన్ మాక్స్వెల్, విని రామన్ల పరిచయం 2013 డిసెంబర్లో జరిగింది. తొలుత స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ 2017లో తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 2022 మార్చి 27న మెల్బోర్న్లో వివాహం చేసుకున్నారు. క్రైస్తవ సంప్రదాయంతో పాటు తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం కూడా వివాహ వేడుకలు నిర్వహించారు. మాక్స్వెల్, విని రామన్ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. 2023 సెప్టెంబర్లో లోగన్ మావెరిక్ మాక్స్వెల్ జన్మించాడు. ఇప్పుడు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించడం వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
View this post on Instagram
