Andhra Pradesh : ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు.. చంద్రబాబు, పవన్, లోకేశ్ పేర్లను ప్రస్తావిస్తూ..
Andhra Pradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
AP Local Body Elections
Andhra Pradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి శనివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంఏ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతోపాటు కరపత్రాలను కౌంటింగ్ సిబ్బంది గుర్తించారు. ఈ కరపత్రాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు పేర్లను ప్రస్తావిస్తూ తమ సమస్యను విన్నవించుకున్నారు.
కరపత్రంలో.. ‘‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్, లోకసభ సభ్యులు, శాసన సభ్యులకు కంకణాలపల్లి గ్రామస్తుల విన్నపం. మా గ్రామంనకు నేరుగా ఉన్న రహదారిలో రైల్వే వారు కొత్తగా యూ ఆకారంలో నిర్మాణం చేపడుతున్నారు. యూ ఆకారంలో నిర్మించడం వలన మా గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతం నేరుగా ఉన్న రహదారిలోనే రైల్వే అండర్ పాస్ నిర్మించి మా గ్రామాన్ని కాపాడాల్సిందిగా వేడుకుంటున్నాము.’’ అని రాసి ఉంది.
