Jagan KTR CM Vijay Meeting : పెండ్లి వేడుకలో సందడి చేసిన వైఎస్ జగన్, కేటీఆర్, సీఎం విజయ్.. ఫొటోలు వైరల్
Jagan KTR CM Vijay Meeting : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్ వైఎస్ జార్జ్‌రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో చెన్నైలోని ఓ హోటల్లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో వైఎస్ జగన్‌తోపాటు తమిళనాడు సీఎం విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వీరంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలుకురించుకొని.. కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


























