Om Raut : రామాయణం ఎఫెక్ట్.. ఓం రౌత్ పై ట్రోల్స్.!
రామాయణం విజువల్స్‌తో 'ఆదిపురుష్'ను పోలుస్తూ నెటిజన్లు ఓం రౌత్‌పై విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.
Ramayana Effect Om Raut Faces Online Trolling
Om Raut : రామాయణం మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రివ్యూస్ అన్ని పాజిటివ్‌గా ఉండటంతో కొత్త చర్చ మొదలైంది. రామాయణం చిత్రంలోని విజువల్స్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ క్వాలిటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సీన్ అత్యంత రిచ్‌గా, భారీ స్థాయిలో తెరకెక్కించడంపై ప్రశంసలు వస్తున్నాయి.
దీంతో రామాయణం విజువల్స్‌తో ‘ఆదిపురుష్’ను పోలుస్తూ నెటిజన్లు ఓం రౌత్‌పై విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. రామాయణం’ సక్సెస్ టాక్‌తో ఓం రౌత్ మరోసారి ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
Sai Durgha Tej : మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్.. నిశ్చితార్థం ఫోటోలు..
ప్రభాస్ శ్రీరాముడిగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైన సమయంలో ఎలాంటి ట్రోలింగ్ ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి దర్శకుడు ఓం రౌత్ నెటిజన్ల టార్గెట్‌గా మారారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాణంలో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రామాయణం పార్ట్-1కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆదిపురుష్, రామాయణం విజువలైజేషన్, గ్రాఫిక్స్‌కు పోలుస్తూ తెగ ఆడేసుకుంటున్నారు. హనుమాన్ మూవీ రిలీజ్ అప్పుడు ఆదిపురుష్ మూవీని తెరపైకి తెచ్చి ట్రోల్ చేశారు.
ఇప్పుడు రామాయణం సినిమాతో ఇటు ప్రభాస్‌కి గానీ, అటు ఓం రౌత్‌కు సంబంధమే లేదు. కానీ ఈ కథతో సంబంధం ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ఇదే ఇతిహాసం ఆధారంగా ‘ఆదిపురుష్’ అనే సినిమా చేశారు. అందుకే ఇప్పుడు ఆ సినిమా వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ఓం రౌత్ ను ట్రోల్ చేసే డార్లింగ్ ఫ్యాన్స్.. మరోసారి ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
