Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో తోపు ఓపెనర్.. సచిన్ రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు.
Rohit Sharma becomes fastest opener to 10000 ODI runs
Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓపెనింగ్ బ్యాటర్‌గా అత్యంత వేగంగా 10 వేల పరుగులను పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్‌లో వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ వ్యక్తి గత స్కోరు 2 పరుగుల వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 22 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 214 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను చేరుకోగా రోహిత్ శర్మ కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
IND vs PAK : ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు స్వర్ణం.. ఫైనల్లో పాక్ పై భారత్ ఘన విజయం..
ఇక వన్డేల్లో ఓపెనర్‌గా 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ప్లేయర్‌గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు. సచిన్ టెండూల్కర్, క్రిస్‌గేల్, సనత్ జయసూర్యలు మాత్రమే రోహిత్ కన్నా ముందు ఈ మైలురాయిని చేరుకున్నారు.
వన్డేల్లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ (భారత్) – 202 ఇన్నింగ్స్‌ల్లో
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 214 ఇన్నింగ్స్‌ల్లో
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 268 ఇన్నింగ్స్‌ల్లో
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 303 ఇన్నింగ్స్‌ల్లో
