File No 25 Fauzi: ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ రచ్చ.. నేతాజీ – హిట్లర్ సంభాషణతో పూనకాలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
నేతాజీ-హిట్లర్ సంచలన సంభాషణ, ప్రభాస్ పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ఫైల్ నెం.25 : ఫౌజీ(File No 25 Fauzi)’ గ్లింప్స్.
Prabhas hanu raghavapudi movie file no 25 fauji original glimpse released release date
File No 25 Fauzi: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, బ్రిలియంట్ డైరెక్టర్ హను రాఘవపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా నుంచి విడుదలైంది ‘ఫైల్ నెం.25 : ఫౌజీ(File No 25 Fauzi)’ ఒరిజినల్ గ్లింప్స్. సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియో, రెండు వందల ఏళ్ల నాటి స్వాతంత్ర్య పోరాట నేపథ్యాన్ని కళ్లకు కడుతోంది. డార్లింగ్ అభిమానులకు మామూలు పూనకాలు తెప్పించడం లేదు ఈ సంచలన గ్లింప్స్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే అత్యంత ఆసక్తికరమైన, లోతైన సంభాషణతో కథనం అత్యున్నత స్థాయికి చేరుకుంది.
ఈ గ్లింప్స్‌లో హిట్లర్ భారతీయుల సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడగా, మన దేశానికి ఖచ్చితంగా స్వాతంత్య్రం తెచ్చి తీరతానని బోస్ ఇచ్చే కౌంటర్ పీక్స్‌లో నిలిచింది. బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌ను కుప్పకూల్చిన ఏకైక భారతీయ సైనికుడు, వ్యూహకర్త, స్పై అయిన ‘ఫౌజీ’గా ప్రభాస్ పాత్రను పరిచయం చేసిన తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. ప్రసిద్ధ హిట్లర్ ‘ఎనిగ్మా’ కోడ్ కంటే కూడా, మన ఫౌజీ భగవద్గీత ఆధారంగా సృష్టించిన సీక్రెట్ కోడ్‌ను చేధించడం బ్రిటీషర్లకు అసాధ్యంగా మారిందనే పాయింట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
వీడియో చివర్లో ప్రభాస్ తన గంభీరమైన వాయిస్‌తో “హే బ్రిటీషర్.. నీ రక్తాన్ని కళ్లజూసి నా దేశ స్వాతంత్య్రాన్ని బలంగా లాక్కుంటా” అంటూ చెప్పిన భారీ డైలాగ్ ఈ గ్లింప్స్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హను రాఘవపూడి మేకింగ్ విజన్, భారీ విజువల్స్, విజువల్ గ్రాండ్‌నెస్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
