Goddeti Madhavi: స్థానిక పోరులో సంచలనం.. జెడ్పీటీసీ బరిలో మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి నామినేషన్!
అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి(Goddeti Madhavi) కొయ్యూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Former Araku mp goddeti madhavi files nomination for koyyuru zptc in ap local body elections
Goddeti Madhavi: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి(Goddeti Madhavi) మళ్లీ ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆమె, 2024 వరకు ఎంపీగా తన సేవలను అందించారు. గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన ఒక నాయకురాలు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగువ స్థాయి పదవికి పోటీకి దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొయ్యూరు నుంచి నామినేషన్.. రెండున్నరేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ:
పార్లమెంటరీ పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల విరామం తీసుకున్న గొడ్డేటి మాధవి, ఇప్పుడు కొయ్యూరు జెడ్పీటీసీ (ZPTC) అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. ఎంపీగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన అనుభవంతో, ఇప్పుడు స్థానిక గిరిజన ప్రాంత ప్రజలకు మరింత చేరువగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వర్గాలు చెబుతున్నాయి. ఒక మాజీ ఎంపీ జెడ్పీటీసీ బరిలో నిలవడంతో కొయ్యూరు స్థానిక ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది.
