England vs Sri Lanka ODI : ఇంగ్లాండ్‌కు భారీ షాకిచ్చిన శ్రీలంక.. వన్డే క్రికెట్లో అరుదైన రికార్డు.. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఊదేశారు.!
England vs Sri Lanka ODI : రావల్పిండి వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక బ్యాటర్లు చెలరేగిపోయారు. చివరి ఓవర్ వరకు సాగిన హైడ్రామాలో ఇంగ్లాండ్ జట్టుపై రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
England vs Sri Lanka ODI
England vs Sri Lanka ODI : పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై – సిరీస్‌లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగ్గా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 429 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ స్కోర్‌ను శ్రీలంక జట్టు ఛేదించడం అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, శ్రీలంక బ్యాటర్లు ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాకిచ్చారు. నిర్ణీత 50 ఓవర్లలో ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి.. వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోరును ఛేజ్ చేసిన జట్టుగా నిలిచారు.
Also Read : IND vs NZ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం..
ఇంగ్లాండ్ తరపున కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. 116 బంతుల్లో 202 పరుగులు చేసి వన్డే ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జోరూట్ (69), విల్ జాక్స్ (66 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో ఇంగ్లాండ్ చివరి 13 ఓవర్లలోనే ఏకంగా 185 పరుగులు రాబట్టింది. మొత్తంగా నాలుగు వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు గెలవాలంటే 430 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఇంత భారీ స్కోర్ ను ఛేజ్ చేయడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ, శ్రీలంక బ్యాటర్లు ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చారు.
శ్రీలంక జట్టు తొలుత వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో గెలుపు అవకాశాలను క్లిష్టం చేసుకుంది. కానీ, ఆవిష్క ఫెర్నాండో (97), పవన్ రత్నాయకే (130) మూడో వికెట్ కు 137 బంతుల్లో 166 పరుగులు జోడించారు. అవిష్క ఫెర్నాండో ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన దాసున్ శనక (50బంతుల్లో 97) సిక్సర్ల వర్షం కురిపించాడు. రత్నాయకేతో కలిసి శనక 79 బంతుల్లోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను లంకవైపు తిప్పేశాడు. రత్నాయకే, ఆ తర్వాత శనక ఔటైనప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియనేగే (27 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.
చివరి ఓవర్లలో శ్రీలంక జట్టు విజయం సాధించాలంటే 8 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. జోష్ టంగ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి సింగిల్ రాగా, తర్వాతి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో మళ్లీ మ్యాచ్ ఇంగ్లండ్ వైపు వెళ్లింది. చివరిలో రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. జనిత్ లియనేగే లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాధి ఒక బంతి మిగిలి ఉండగానే శ్రీలంకకు రెండు వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు ఛేజ్ గా ఈ విజయం నిలిచింది. మరోవైపు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం.
The six that sealed a win for the ages 🤩🤩 #CricketTwitter #Cricket #ODICricket
https://t.co/MmQR40DIuX
— Cricbuzz (@cricbuzz) October 22, 2026
