Google Chrome : బిగ్ అలర్ట్.. క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ ఫోన్, పీసీ హ్యాకర్ల చేతుల్లోకి!
Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది. బ్రౌజర్లో ప్రమాదకరమైన సెక్యూరిటీ లోపాలు గుర్తించడంతో వెంటనే క్రోమ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలివే..
Using Google Chrome
- గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్..
- క్రోమ్‌లో డేంజరస్ సెక్యూరిటీ లోపాలు
- క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక..
Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా చాలామంది ఎక్కువగా క్రోమ్ బ్రౌజర్‌ను వాడేస్తుంటారు.. అయితే, ఇప్పుడు క్రోమ్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ అయింది. మీ బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోకపోతే సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In హెచ్చరించింది.
క్రోమ్‌లో అసలేం జరిగింది? :
గూగుల్ క్రోమ్‌లో పలు కీలకమైన సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు CERT-In వెల్లడించింది. ముఖ్యంగా XML హ్యాండ్లింగ్, V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్, GPU, WebGL వంటి విభాగాల్లో సమస్యలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో కొన్ని లోపాల కారణంగా హ్యాకర్లు యూజర్ల డివైజ్ లను టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. CVE-2026-125350గా గుర్తించిన ఒక సెక్యూరిటీ లోపాన్ని హ్యాకర్లు ఇప్పటికే వాడుతున్నట్టు సమాచారం. అంటే ఇది కేవలం వార్నింగ్ మాత్రమే కాదు.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా..
Read Also : SCSS Vs MIS : రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం కావాలా? ఎక్కువ వడ్డీ కావాలా? పోస్టాఫీస్‌లో ఏ స్కీమ్ బెస్ట్?
హ్యాకర్లు ప్రత్యేకంగా జనరేట్ చేసిన డేంజరస్ వెబ్సైట్లను యూజర్లు ఓపెన్ చేసేలా చేసి ఈ లోపాలను వాడుకోవచ్చు.. అలా జరిగితే మీ వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, డివైజ్ ల్లో హానికరమైన కోడ్ రన్ చేయడం, సిస్టమ్ పర్ఫార్మెన్స్ దెబ్బతీయడం వంటి రిస్క్ ఉండొచ్చు..
వెంటనే క్రోమ్ అప్డేట్ చేసుకోండి :
157.0.8103.50 కన్నా పాత క్రోమ్ వెర్షన్లు, అలాగే 156.0.8078.96 కన్నా పాత (Extended Stable) వెర్షన్లు రిస్క్‌లో ఉన్నాయని హెచ్చరించారు. అందుకే వెంటనే క్రోమ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ పైన ఉన్న త్రి డాట్స్ పై క్లిక్ చేయండి. (Help)లోకి వెళ్లి (About Google Chrome)పై క్లిక్ చేయండి. కొత్త అప్డేట్ ఉంటే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అవుతుంది.
ఇన్స్టాల్ అయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి. చిన్న అప్డేట్ను నిర్లక్ష్యం చేసినా పెద్ద సైబర్ రిస్క్ ఎదుర్కోవాల్సి రావొచ్చు.. అన్ నౌన్ లింకులు, అనుమానాస్పద వెబ్సైట్లకు దూరంగా ఉండండి. మీ డిజిటల్ భద్రత మీ చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు..
