IPS Transfers: తెలంగాణలో 21 మంది IPSల బదిలీ.. హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్(IPS Transfers) అధికారులను బదిలీ చేయగా, హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్ నియమితులయ్యారు.
Telangana government Transfers 21 IPS officers
IPS Transfers: తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో పరిపాలనాపరమైన ప్రక్షాళన చేపట్టింది. శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు పాలనలో వేగం పెంచే లక్ష్యంతో ఒకేసారి 21 మంది ఐపీఎస్(IPS Transfers) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ బదిలీల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో విచారణ
కీలక విభాగాలకు నూతన సారథులు.. ఏసీబీ డీజీగా చారు సిన్హా, జైళ్ల శాఖకు స్వాతి లక్రా:
ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఇతర ప్రధాన విభాగాలకు కూడా ప్రభుత్వం అనుభవజ్ఞులైన అధికారులను కేటాయించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాకు బాధ్యతలు అప్పగించగా, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాను నియమించింది. అలాగే మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీగా సౌమ్య మిశ్రాకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకేసారి ఇంతమంది సీనియర్ అధికారులకు స్థానచలనం కల్పించడం ఇప్పుడు తెలంగాణ అధికార, పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
