WhatsApp Chats : బాబోయ్.. వాట్సాప్‌లో మన చాట్స్ నిజంగా సీక్రెట్టేనా? Google AI చెప్పిన షాకింగ్ నిజాలు!
WhatsApp Chats : వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నిజంగా మన డేటాకు ప్రొటెక్షన్ కల్పిస్తోందా? గూగుల్ AI పరిశోధనలో ఏం తేల్చింది? చాటింగ్ ప్రైవసీ, భద్రతపై షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Your WhatsApp Chats Really Private
- మన రహస్యాలు వాట్సాప్‌లో భద్రమేనా? గూగుల్ AI పరిశోధనతో కొత్త చర్చ
- ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్.. మన డేటాకు గ్యారెంటీ ఉందా?
- వాట్సాప్ భద్రతపై గూగుల్ ఏఐ చెప్పిన నమ్మలేని నిజాలు
WhatsApp Chats : మనిషి జీవితంలో ఇప్పుడు రెండు విషయాలు అత్యంత రహస్యం. ఒకటి బ్యాంక్ పాస్వర్డ్.. రెండోది వాట్సాప్ చాటింగ్.. అయితే, ఇంట్లో చెప్పుకోలేని విషయాలు అన్నింటికీ ఇదే అడ్డా. అలాంటి వాట్సాప్ మన ప్రైవసీకి ఎంతవరకు భరోసా ఇస్తోంది? మన డేటా నిజంగానే భద్రంగా ఉందా? అంటే.. గూగుల్ ఏఐ రీసెర్చ్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టేసింది..
నిజంగా డేటాకు గ్యారెంటీ ఉందా? :
వాట్సాప్ ఎప్పటి నుంచో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటూ తన సేఫ్టీ గురించి గొప్పగా చెబుతోంది. అంటే మనం పంపిన మెసేజ్‌ను మనం, అవతలి వ్యక్తి తప్ప మరెవరూ చదవలేరన్నమాట. వాట్సాప్ కూడా మన చాటింగ్ చూడలేదని సంస్థ చెబుతోంది. తాజాగా గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్లు AI సాయంతో ఈ ఎన్క్రిప్షన్కు ఆధారమైన సిగ్నల్ ప్రోటోకాల్‌లోని కీలక భద్రతా అంశాలను గణితపరంగా పరిశీలించారు..
వాట్సాప్ భద్రతపై గూగుల్ ఏఐ పరిశోధన :
ఆల్ఫాప్రూఫ్ కోడ్ అనే ఏఐ ఫ్రేమ్‌వర్క్‌తో కేవలం 4 వారాల్లోనే ఈ రీసెర్చ్ పూర్తి చేశారు. ఫార్వర్డ్ సీక్రసీ, అథెంటికేషన్, పోస్ట్ కంప్రమైజ్ సెక్యూరిటీ వంటి కీలక రక్షణ వ్యవస్థలను పరీక్షించారు. పరిశీలించిన కోడ్‌లో కొత్త భద్రతా లోపాలేవీ గుర్తించలేదు. గతంలో లోపాలున్న కోడ్ వెర్షన్లలో వాటిని కూడా ఏఐ గుర్తించింది.
అయితే, ఇక్కడే అసలు కిటుకు ఉంది. సిగ్నల్ ప్రోటోకాల్ బలంగా ఉందని తేలితే వాట్సాప్ మొత్తం సురక్షితమైపోయినట్టా? అస్సలు కాదు.. ఇంటికి వేసిన తాళం ఎంత గట్టిగా ఉందో టెస్టింగ్ చేశారు అంతే.. కానీ, ఇంటి కిటికీలు తెరిచి ఉన్నాయో లేదో చూస్తే కదా తెలిసేది..
మన ప్రైవసీకి ఢోకా లేదా? :
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫోన్ వేరే వాళ్ల చేతికి చిక్కినా, డేంజరస్ యాప్‌లు ఇన్స్టాల్ చేసినా, అన్‌లాక్ చేసినా ఫోన్‌ను మరొకరు వాడినా మన ప్రైవసీకి ముప్పు తప్పదు. స్క్రీన్షాట్లు తీసుకోవడాన్ని కూడా ఎన్క్రిప్షన్ ఆపలేదు.
అందుకే గూగుల్ ఏఐ రీసెర్చ్ చూసి వాట్సాప్‌లో ఏదైనా పంపించేయొచ్చని సంబరపడకండి. తాళం బలంగా ఉండటం మంచిదే.. కానీ తాళం చెవి ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు కదా.. టెక్నాలజీ మన రహస్యాలను కాపాడుతుంది.. కానీ మన అజాగ్రత్తకు మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదని తేలిపోయింది…
