IND vs PAK : అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీలు.. గోల్ మెడల్ మ్యాచ్‌లో పాక్ ముందు భారీ లక్ష్యం..
ఆసియా క్రీడలు 2026లో భాగంగా పాక్‌తో జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో (IND vs PAK ) భారత జట్టు భారీ స్కోరు సాధించింది.
Asian Games 2026 IND vs PAK Gold Medal Match Abhishek Sharma Half century Team India 211 runs in 20 overs
IND vs PAK : ఆసియా క్రీడలు 2026లో భాగంగా జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (61; 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), తిలక్ వర్మ (51 నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు మెరుపు హాఫ్ సెంచరీలు బాదగా.. శివమ్ దూబె (27; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓ మోస్తరు ఆరంభం దక్కింది. 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ జట్టు స్కోరు 28 పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ నిరాశ పరిచాడు. 4 బంతుల్లో 2 పరుగులను మాత్రమే చేశాడు.
Innings Break!
Superb contributions all through the order take #TeamIndia to 2️⃣1️⃣1️⃣/6 in the Gold Medal contest 💪
Over to our bowlers to defend 🎯
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/nfMkldToiV
— BCCI (@BCCI) October 3, 2026
అయితే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కూడా తన దూకుడును కొనసాగించాడు. ఓ భారీ షాక్ కు యత్నించి స్టంపౌట్ అయి మూడో వికెట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అభిషేక్ ఔట్ అయిన తరువాత ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది. శ్రేయస్ అయ్యర్ (21; 24 బంతుల్లో 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (20; 18 బంతుల్లో 3 ఫోర్లు) లు వేగంగా ఆడలేకపోయారు.
కాగా..ఇన్నింగ్స్ ఆఖరిలో తిలక్ వర్మ, శివమ్ దూబె లు దంచికొట్టారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో దూబె ఔట్ అయినా రెండు సిక్సర్లు కొట్టి 21 బంతుల్లో తిలక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
