NtrNeel: తెరపైకి ఎన్టీఆర్- అలియా జోడీ.. డ్రాగన్ సినిమాలో కీ రోల్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
ఎన్టీఆర్(NtrNeel) 'డ్రాగన్' సినిమాలో అలియా భట్ స్పెషల్ రోల్ చేస్తుందని సమాచారం.
alia bhatt doing a special role in ntr dragon
- మరోసారి తారక్ సరసన అలియా భట్
- డ్రాగన్ సినిమాలో ఆర్ఆర్ఆర్ కాంబో
- ప్రశాంత్ నీల్ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్(NtrNeel) సరసన అలియా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
Chiyaan Vikram: శంకర్ తో విక్రమ్ సినిమా.. మేలో స్టార్ట్.. డిసెంబర్ లో రిలీజ్
ఇప్పటికే డ్రాగన్ సినిమా మేకర్స్ ఆమెతో చర్చలు జరిపిందని, కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గురించి కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తొలుత ఈ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ టొవినో థామస్‌ను సంప్రదించినప్పటికీ, కాల్షీట్ల సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ అండ్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2026 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
