Hyundai Creta Summer Edition : కొత్త హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ అదుర్స్.. ఈ మిడ్ సైజ్ SUV ధర జస్ట్ ఎంతంటే?
Hyundai Creta Summer Edition : కొత్త మిడ్-సైజ్ SUV కారు కొనాలని చూస్తున్నారా? కొత్త హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. పూర్తి ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
Hyundai Creta Summer Edition
- హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ మీ బడ్జెట్ ధరలోనే
- మిడ్ సైజ్ SUV కొనాలని చూస్తున్నారా? ధర ఎంతంటే?
- ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో సహా అనేక అడ్వాన్స్ ఫీచర్లు
Hyundai Creta Summer Edition : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్. హ్యుందాయ్ అభిమానులకు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్.. భారత మార్కెట్లో, మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ వివిధ కార్ల తయారీదారుల నుంచి అనేక కార్లను అందిస్తోంది.
మీరు భవిష్యత్తులో మిడ్-సైజ్ SUV కొనుగోలు చేయాలని చేయాలనుకుంటే ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్‌ను కొనేసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. హ్యుందాయ్ క్రెటా SUV అనేది కంపెనీ అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్ యూవీ కార్లలో ఒకటి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ ధర, వేరియంట్లు :
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ ధర విషయానికి వస్తే.. హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ ధర రూ. 12.05 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ SUV టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 17.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ SUV కారు మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. EX, EX(O), S(O), S(O) నైట్, SX, SX ప్రీమియం మోడల్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ ఫీచర్లు :
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ డాష్‌క్యామ్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో సహా అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. హై వేరియంట్లు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్స్ బ్యాక్ సన్‌షేడ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్యాక్ కెమెరాతో సహా మరిన్ని ఫీచర్లను అందిస్తాయి.
ఇంజిన్, పర్ఫార్మెన్స్ :
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ ఇంజన్ ఆప్షన్లు మారలేదు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, IVT (CVT), ఆటోమేటిక్ ఉన్నాయి.
హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడయ్యే క్రెటా కారుకు 1.4 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు 2లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది.
