Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్లు.. ఆ 4 నగరాల్లో మాత్రమే.. 5G యాక్టివేట్ ఎలా చేసుకోవాలో తెలుసా?

Jio 5G launched in India : రిలయన్స్ జియో భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5Gని ప్రారంభించింది. దేశీయ టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వీసులను అందిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి పాన్ ఇండియా జియో 5G సర్వీస్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ ధృవీకరించింది.

Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్లు.. ఆ 4 నగరాల్లో మాత్రమే.. 5G యాక్టివేట్ ఎలా చేసుకోవాలో తెలుసా?

Jio 5G launched in India Download speed, Welcome offer plans, list of 4 eligible cities, how to activate 5G

Jio 5G launched in India : రిలయన్స్ జియో భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5Gని ప్రారంభించింది. దేశీయ టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వీసులను అందిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి పాన్ ఇండియా జియో 5G సర్వీస్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ ధృవీకరించింది. ప్రస్తుతం Jio 5G 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గత నెలలో భారత్ మార్కెట్లో 5Gని ప్రారంభించారు. Jio, Airtel రెండూ తమ 5G సర్వీసులను ప్రకటించాయి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై వంటి నగరాల్లో జియో 5G అందుబాటులో ఉంది. టెలికాం ఆపరేటర్ Jio 5G సర్వీస్ పాన్ ఇండియాగా రానుందని ధృవీకరించింది. 2023 చివరి నాటికి 5G సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది.

Jio 5G launched in India Download speed, Welcome offer plans, list of 4 eligible cities, how to activate 5G

Jio 5G launched in India Download speed, Welcome offer plans, list of 4 eligible cities

జియో 5G డౌన్‌లోడ్ స్పీడ్ (Jio 5G Download Speed) ఎంతంటే? :
Ooklas Speedtest ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. Jio, Airtel రెండూ 809.94mbps వరకు 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందిస్తున్నాయి. నివేదిక ప్రకారం.. ఢిల్లీలో, జూన్ నుంచి రిలయన్స్ జియో 600mbps (నిర్దిష్టంగా చెప్పాలంటే 598.58mbps) తాకింది. మరోవైపు, కోల్‌కతా, వారణాసి, ముంబైలలో, జియో 5G డౌన్‌లోడ్ స్పీడ్ 482.02mbps, 485.22mbps, 515.38mbpsకి చేరుకుంది.

జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer)  :
భారత్‌లో 5G సర్వీసులను ప్రారంభించిన వెంటనే Reliance Jio 5G వెల్‌కమ్ ఆఫర్ 2022ని ప్రకటించింది. ఆఫర్ కింద.. Jio అర్హతగల యూజర్లకు 1gbps అన్‌లిమిటెడ్ డేటా స్పీడ్ ఉచితంగా అందిస్తోంది. అర్హులైన యూజర్లు ఎవరు? ఏయే 4 నగరాల్లో నివసించే 5G ఫోన్‌లకు Jio 5G అందుబాటులో ఉంటుందో తెలుసుకోవచ్చు.

Jio 5G launched in India Download speed, Welcome offer plans, list of 4 eligible cities, how to activate 5G

Jio 5G launched in India Download speed, Welcome offer plans, list of 4 eligible cities

Jio 5G ప్లాన్లు (Jio 5G Plans) :
రిలయన్స్ జియో ఇంకా 5G ప్లాన్‌లకు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం, అర్హత కలిగిన యూజర్ల కోసం 4G ప్లాన్‌లలో 5G సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. జియో వెల్‌కమ్ ఆఫర్ 2022 కింద, రిలయన్స్ జియో ఉచిత 5G సర్వీసును అందిస్తోంది.

Jio 5G : ఎలా యాక్టివేట్ చేయాలి :
5G ఫోన్‌ని కలిగి ఉన్నా అర్హత ఉన్న నగరాల్లో ఒకదానిలో నివసిస్తున్న వినియోగదారులకు Jio వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుంది. మీకు వెల్‌కమ్ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి, కేవలం MyJio యాప్‌కి వెళ్లండి. ఇన్వైట్ యాప్‌లో కనిపిస్తుంది. ఆ ఇన్విటేషన్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌లో Jio 5G సర్వీసులను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Network : ఈ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే జియో 5G సపోర్టు చేస్తుంది.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!