Ram Charan: మెగా పవర్ స్టార్ డబుల్ ధమాకా.. ఒకే రోజు సుకుమార్, బుచ్చిబాబుల సర్ప్రైజ్ ట్రీట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సినిమాల నుంచి ఆయన బర్త్ డే రోజున రెండు అప్డేట్స్ రానున్నాయి.
sukumar, peddi movie updates on ram charan birthday
- రామ్ చరణ్ బర్త్ డేకి డబుల్ ట్రీట్
- సుకుమార్ మూవీ కాన్సెప్ట్ పోప్స్టర్
- పెద్ది నుంచి టీజర్ రానుంది
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఈ ఏడాది మార్చి నెల అత్యంత ప్రత్యేకం కాబోతోంది. ‘రంగస్థలం’ వంటి సంచలన విజయం తర్వాత చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC17’ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Manjusha: చీరలో యాంకరమ్మ సింగారం.. స్టన్నింగ్ లుక్ కెవ్వు కేక.. ఫొటోలు
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘RC17’ నుండి ఒక పవర్ఫుల్ సర్ప్రైజ్ రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, సుకుమార్ ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని టీమ్ వర్గాల టాక్.మరోవైపు, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్(Ram Charan) నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది.
ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న నేపథ్యంలో, చరణ్ బర్త్ డే కానుకగా ‘పెద్ది’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్, గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. టీజర్ వస్తే అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం. ఒకే రోజు అటు సుకుమార్ సినిమా అప్డేట్, ఇటు ‘పెద్ది’ టీజర్ రానుండటంతో మార్చి 27న మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఈ రెండు అప్డేట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తాయో వేచి చూడాలి.
