Dada Song : బాలకృష్ణ ‘దాదా’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య పాడిన పాట ఎలా ఉంది..?
మీరు కూడా డా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ వినేయండి..(Dada Song)
Dada Song
Dada Song : బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా దాదా. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
దాదా సినిమా డిసెంబర్ 24 వస్తుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా దాదా సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. బాలకృష్ణ, నర్గిస్ ఫక్రితో స్పెషల్ సాంగ్ గా చిత్రీకరించాడు ఈ పాటని. తమన్ సంగీత దర్శకత్వంలో రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాయగా బాలకృష్ణ, శ్రీ పూర్ణిమ పాడారు.
మీరు కూడా డా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ వినేయండి..
