Vivo V50 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. రూ.40 వేల Vivo V50 ఫోన్ ఇప్పుడు రూ.29 వేలకే..!
Vivo V50 Discount : వివో వి50 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.30,799 ధరకు లభిస్తున్న ఈ ఫోన్‌ను యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్‌తో రూ.29,259కే పొందవచ్చు. 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్ప్లే వంటి ఫీచర్ల పూర్తి వివరాలివే..
Vivo V50 Discount
- వివో లవర్స్‌కు గుడ్ న్యూస్..
- వివో V50పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్
- రూ. 5,740 డిస్కౌంట్‌తో రూ.29,259కే సొంతం
Vivo V50 Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మంచి కెమెరా, భారీ బ్యాటరీ, ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ తక్కువ ధరలో కావాలా? అయితే, వివో V50పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.5,740 వరకు తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో ధర మరింత తగ్గి రూ.29,259కే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 ధర ఎంతంటే? :
వివో V50 ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.39,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.30,799కు లిస్ట్ అయింది. దీనికి అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో రూ.1,540 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.29,259కు చేరుతుంది. అయితే, రూ.199 ప్రొటెక్ట్ ప్రామీస్ ఫీజు అదనంగా వర్తించవచ్చు. ఈ ఆఫర్ నిబంధనలు, ఫైనల్ ధరను ఆర్డర్ చేసే ముందు చెక్ చేసుకోండి..
Read Also : Samsung Galaxy F70 5G : రూ.30వేల శాంసంగ్ 5G ఫోన్ ఇప్పుడు రూ.18 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..
డిస్ప్లే, కెమెరాలు అదుర్స్ :
ఈ ఫోన్లో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో 50MP కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు. ఫొటోలు, సెల్ఫీలు ఇష్టపడేవారికి ఆకట్టుకునే ఫీచర్ అని చెప్పొచ్చు..
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ :
స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. IP68, IP69 రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అయితే, ఈ వివో ఫోన్ 2025 ఫిబ్రవరిలో లాంచ్ అయింది.
కొనే ముందు కొత్త మోడళ్లతో కంపేర్ చేయడం బెటర్.. ముఖ్యంగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘Buy Now’ బదులు ‘Notify Me’ కనిపిస్తే స్టాక్ లేదా పిన్‌కోడ్ సమస్య ఉండొచ్చు. అందుకే ఆర్డర్ చేసే ముందు మీ ప్రాంతానికి డెలివరీ అందుబాటులో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి.
