Dil Raju : ‘టాక్సిక్’ ఫలితంపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. నాపై పెయిడ్ ప్రమోషన్స్.. నేను అన్ని గమనిస్తాను..
ఇటీవల యశ్ టాక్సిక్ సినిమా భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. (Dil Raju)
Dil Raju
Dil Raju : నిర్మాత దిల్ రాజు ఇటీవల సినిమాల నిర్మాణం తగ్గించినా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం పలు భారీ సినిమాలు తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. తాజాగా రామాయణం, సీన్ సినిమాలను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేసారు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు వచ్చాయి. దీంతో దిల్ రాజు నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
అయితే ఇటీవల యశ్ టాక్సిక్ సినిమా భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. ఈ సినిమాని కూడా తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఆయనకి భారీ నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి.సోషల్ మీడియాలో కూడా దిల్ రాజుకి నష్టం అంటూ పోస్టులు పెట్టారు. నేడు జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు దీనిపై స్పందించారు.
Also Read : Scene : వామ్మో.. అన్ని కోట్లకు ఓటీటీకి అమ్ముడయిన సూర్య ‘సీన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దిల్ రాజు మాట్లాడుతూ.. సక్సెస్ వస్తేనే డబ్బు, ఎనర్జీ వస్తుంది. రీసెంట్ గా నేను టాక్సిక్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ సినిమా పోతే మొత్తం నాకే నష్టం అయినట్టు పెయిడ్ ప్రమోషన్స్ జరిగాయి. కల్చర్ అలా తయారయింది. టాక్సిక్ లో నాకు నష్టం లేదు. ఎంతో కొంత లాభం వచ్చింది. ఇప్పుడు రామాయణలో కూడా లాభం వచ్చింది. పనిచేసినందుకు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్స్ పర్శంటేజ్ నాకు టాక్సిక్ లో వచ్చింది. కానీ బయటకు నేను నష్టపోయినట్టు చూపించారు ప్రమోషన్ చేసి. నేను ఏమి గమనించను అన్నట్టు ఉంటాను కానీ మా టీమ్ ఎప్పటికప్పుడు అన్ని పంపుతారు. నేను అన్ని చూస్తాను. చూసి ఓకే ఇదా అని పక్కన పెట్టేస్తాను అని తెలిపారు.
