Bigg Boss Thrigun : బిగ్ బాస్ త్రిగున్ కొత్త సినిమా ‘జంగా’ గ్లింప్స్ రిలీజ్.. రా & రస్టిక్ లుక్స్‌లో త్రిగున్..
మీరు కూడా త్రిగున్ జంగా గ్లింప్స్ చూసేయండి.. (Bigg Boss Thrigun)
Bigg Boss Thrigun
Bigg Boss Thrigun : త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘జంగా’. శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మాణంలో కెవిన్ గడ్డం(శ్రీహరి) దర్శకత్వంలో ఈ జంగా సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం త్రిగున్ బిగ్ బాస్ సీజన్ 10 లో ఆట అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా త్రిగున్ జంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో.. ‘కొన్ని లక్షల ఏండ్లు పట్టింది.. పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే.. మరణం వదం అయితాది’ అంటూ త్రిగుణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. త్రిగున్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.
Also Read : God Of War : మొదలైన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా పనులు.. ఫొటోలు వైరల్.. ఫ్యాన్స్ ఖుషీ..
దర్శకుడు రాంగోపాల్ వర్మ జంగా గ్లింప్స్‌ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. మీరు కూడా త్రిగున్ జంగా గ్లింప్స్ చూసేయండి..
