IND vs NZ : బ్యాటర్లు విఫలం.. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన భారత్.. ఏకంగా 244 పరుగుల తేడాతో..
IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
IND vs NZ 4th ODI New Zealand won by 244 runs
IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (27; 53 బంతుల్లో 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (21; 36 బంతుల్లో 3 ఫోర్లు), నమన్ ధీర్ (21; 24 బంతుల్లో 2 సిక్సర్లు) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు డకౌట్లు అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (5) ఘోరంగా విఫలం అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఆరు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు సాధించాడు. కైల్ జేమిసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
New Zealand win the 4th ODI by 244 runs.
We go again for the 5th and final ODI on Sunday with #TeamIndia leading the series 2-1.
Scorecard ▶️ https://t.co/5IIzn3UMi2
#NZvIND https://t.co/a9HZSGxfQK
— BCCI (@BCCI) November 13, 2026
లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి రోహిత్ శర్మ, ఐదో బంతికి విరాట్ కోహ్లీ, ఆరో బంతికి శ్రేయస్ అయ్యర్‌లను న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఔట్ చేసి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాకరాక వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతడు కైల్ జేమీసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్‌కు కాసేపు వికెట్ పతనాన్ని అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించిన తరువాత అక్షర్ ఔట్ కాగా.. కొద్ది సేపటికే ఇషాన్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ సెంచరీ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేశాడు. టిమ్ సీఫెర్ట్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఫిన్ అలెన్ (41; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అకిల్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్‌లు చెరో వికెట్ తీశారు.
