Siddharth Galla : మహేష్ బాబు మేనల్లుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. కొరియన్ అమ్మాయితో పెళ్లి.. ఫొటోలు వైరల్..
మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం ఇటీవల కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగబోతుండగా తాజాగా ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ ప్రీ వెడ్డింగ్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో కాబోయే జంట సిద్దార్థ్ గల్లా, హైన్ కిమ్ తో పాటు నమ్రత, సిద్దార్థ్ తల్లి, మంజుల, మహేష్ బావ సంజయ్, మహేష్ మేనకోడలు జాన్వీ స్వరూప్, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని.. పలువురు ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఉన్నారు.








Siddharth Galla Pre Wedding Celebrations
