OPPO A7 Ultra Launch : 12,000mAh బ్యాటరీతో OPPO కొత్త ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్నిరోజులు వస్తుందంటే?
OPPO A7 Ultra Launch Date : ఒప్పో A7 అల్ట్రా ఫోన్ డిసెంబర్లో లాంచ్ కానుందా? ఏకంగా 12,000mAh భారీ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, ఆకట్టుకునే డిజైన్‌తో రానున్న ఈ కొత్త ఫోన్ ఫీచర్లు, లీక్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
OPPO A7 Ultra Launch
- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో సంచలనం..
- ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే ఒప్పో A7 అల్ట్రా ఫోన్
- 12000mAh బ్యాటరీ.. ఒప్పో కొత్త ఫోన్‌పై భారీ అంచనాలు
OPPO A7 Ultra Launch Date : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది.. బయటకు వెళ్లినప్పుడు ఛార్జర్, పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.. అన్ని టెన్షన్లకు చెక్ పెట్టేలా ఒప్పో నుంచి భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అదే ఒప్పో A7 అల్ట్రా ఫోన్.. ఈ ఒప్పో మోడల్ డిసెంబర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. పూర్తి వివరాలివే..
12,000mAh బ్యాటరీ స్పెషాలిటీ :
ఈ ఫోన్లో ఏకంగా 12,000mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. టిప్‌స్టర్ ప్రకారం.. ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తి పెంచుతున్నాయి. చైనా ఎంఐఐటీ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో PNC110 మోడల్ నంబర్‌తో ఓ ఫోన్ కనిపించింది. ఇందులో 11,640mAh రేటెడ్ బ్యాటరీ, 11,900mAh సాధారణ సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.. మార్కెట్లో 12,000mAh బ్యాటరీ పేరుతో రావచ్చని అంచనా..
ఆకట్టుకునేలా డిజైన్ :
లీకైన ఫొటోల ప్రకారం.. ఈ ఫోన్ పర్పుల్ కలర్లో కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ అడ్డంగా ఉండే భారీ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉండనున్నట్లు సర్టిఫికేషన్ వివరాలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో 10,000mAh బ్యాటరీ, ఎ7 ప్రోలో 8,000mAh బ్యాటరీ అందించింది. ఇప్పుడు A7 అల్ట్రా నిజంగానే 12,000mAh బ్యాటరీతో వస్తే ఈ సిరీస్‌లోనే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది..
భారత్‌లోకి వస్తుందా? ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఈ ఫోన్ ప్రాసెసర్, డిస్ప్లే సైజు, ఛార్జింగ్ స్పీడ్, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది. భారత్‌లో లాంచ్ ధరపై ఇంకా క్లారిటీ లేదు. భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు, మందం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఒప్పో నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.. డిసెంబర్లో ఈ ఫోన్‌పై మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.
