Top 5 Camera Phones 2026 : ఫోన్‌తోనే DSLR లాంటి ఫొటోలు.. 2026లో అదరగొడుతున్న టాప్ 5 కెమెరా స్మార్ట్ఫోన్లు ఇవే
Top 5 Camera Phones 2026 : 2026లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు దుమ్మురేపుతున్నాయి.. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా సహా టాప్ 5 కెమెరా ఫోన్ల ఫీచర్లు, ప్రత్యేకతలివే..
Top 5 Camera Phones 2026
- ఫొటోగ్రఫీ ప్రియులకు పండగే..
- 2026లో కొనాలనిపించే 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు
- ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు టాప్ కెమెరా ఫోన్లు
- 200MP కెమెరాతో దుమ్మురేపుతున్న మొబైల్స్
Top 5 Camera Phones 2026 : ఒకప్పుడు మంచి ఫొటోలు తీయాలంటే DSLR కెమెరా తప్పనిసరి అనుకునేవారు.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తోనే అద్భుతమైన ఫొటోలు, క్లారిటీ ఉన్న వీడియోలు తీసుకోవచ్చు.. ముఖ్యంగా కెమెరా టెక్నాలజీలో కంపెనీలు పోటీపడుతుండటంతో కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2026లో ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకుంటున్న టాప్ 5 కెమెరా ఫోన్లు ఏంటో ఇప్పడు చూద్దాం..
1. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా :
ఫోల్డబుల్ ఫోన్లను ఇష్టపడేవారికి ఈ మోడల్ అద్భుతమైన ఆప్షన్.. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 50MP, 10MP కెమెరాలు ఉన్నాయి. భారీ 8 అంగుళాల డిస్ప్లే, పవరర్ ఫుల్ ప్రాసెసర్ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
2. ఐఫోన్ డ్యూయో :
ఐఫోన్ కెమెరా క్వాలిటీని ఇష్టపడేవారికి ఈ మోడల్ అద్భుతమైన ఆప్షన్. ఇందులో 48MP మెయిన్, 48MP అల్ట్రా వైడ్ కెమెరాలతో పాటు 2x ఆప్టికల్ జూమ్ బెనిఫిట్ కూడా ఉంది.
Read Also : Telangana Ration Card : తెలంగాణ ప్రజలకు డబుల్ ధమాకా.. ఒకేసారి 2 పథకాలు.. రేషన్ కార్డు ఉంటే చాలు..!
3. ఐఫోన్ 17 ప్రో :
ఫొటోలు, వీడియోలు రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చేవారికి బెస్ట్ ఆప్షన్. ఇందులో 48ఎంపీ మెయిన్, పెరిస్కోప్ టెలిఫొటో, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 18ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
4. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా :
200ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ, 10ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. జూమ్ ఫొటోగ్రఫీ ఇష్టపడేవారిని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
5. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా :
డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఈ ఫోన్ స్పెషాలిటీ.. అదనంగా 50MP అల్ట్రా వైడ్, మరో 50MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. 7,050mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు..
కెమెరా ఫోన్ కొనాలనుకునేవారికి 2026లో అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి. అయితే, మెగాపిక్సెల్స్ మాత్రమే చూసి ఫోన్ కొనకూడదు. కెమెరా సెన్సార్, ఫొటో ప్రాసెసింగ్, నైట్ మోడ్, వీడియో క్వాలిటీ, ధర వంటివి కూడా చెక్ చేసి కొనడం బెటర్..
