Motorola Edge 50 Ultra : అద్భుతమైన ఆఫర్.. ఈ మోటోరోలా అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే, ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ కొనుగోలుపై రూ. 15వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

Motorola Edge 50 Ultra : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త మోటోరోలా ఫోన్ భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డీల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో రూ.64,999కి లాంచ్ కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.15,000 తగ్గింపుతో లభిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గాలంటే బ్యాంక్, కార్డ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ డీల్ : భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ రూ.64,999 ధరతో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.49,999కే లిస్ట్ అయింది. రూ.15వేలు నేరుగా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

పాత ఫోన్లు వాడే బదులు కొత్త ఫోన్ కొనేసుకోండి. మీ ఫోన్ బ్రాండ్, మోడల్ బట్టి రూ.39,850 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ ఆప్షన్లు నెలకు రూ.1,758 నుంచి పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

6.7-అంగుళాల pOLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 2,500 నిట్స్ టాప్ లెవల్ చేరుకుంటుంది. ఈ హ్యాండ్సెట్ 4,500mAh బ్యాటరీ కూడా ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.
